బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

0

 బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

BSB-NEWS-KANDUKUR

 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంఈఓ కార్యాలయం ఆవరణంలో 20 మంది బాలికలకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ వారు సి ఎస్ ఆర్ యాక్టివిటీ కింద ఈ సైకిళ్ళను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

మండలంలోని పాలూరు జడ్పీహెచ్ఎస్, మాచవరం, ఉలవపాడు స్కూల్లోని చదువుతున్న పిల్లలకు ఈ సైకిళ్లను అందించడం జరిగిందన్నారు. దూర ప్రాంతాల నుండి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కార్యక్రమంలో సరైన సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. రీజినల్ మేనేజర్ వనపర్తి అప్పలరాజు, మేనేజర్ హెచ్ఆర్ శ్రీనివాస్ నాయక్ లు మాట్లాడుతూ చదువు యొక్క ప్రాముఖ్యతను, స్టేట్ బ్యాంక్ చేస్తున్న సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి క్లుప్తంగా వివరించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)