కందుకూరు డిసెంబర్ 30 BSBNEWS
జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి మోసగాడే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు దోచుకోబట్టే 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా దోచుకున్నాడు. ఈసారైనా ప్రజలు మేలుకోకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.
బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పట్టణంలోని 4వ వార్డు జనార్ధనస్వామి గుడి, నల్ల మల్లి వారి తోట ప్రాంతాల్లో శనివారం నిర్వహించగా, నాగేశ్వరరావు పాల్గొని పార్టీ మినీ మేనిఫెస్టో వివరిస్తూ కరపత్రాలు పంచారు.
జగనాసురుడు పెడుతున్న కష్టాలను ప్రజలు నాలుగు న్నరేళ్లు ఓపికగా భరించారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వ టానికి సిద్ధమయ్యారు కాబట్టే, వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఇన్చార్జిలను అటు ఇటు మార్చినా ఏమీ లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అయిపోయింది. కందుకూరులో కూడా మార్పు జరగబోతోందని నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రానికి 60 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని జగన్ పదే పదే చెబుతున్నారు. ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. జగన్ సీఎం గా ఉండగా, రాష్ట్రానికి కంపెనీలు కూడా వస్తాయా అని ప్రజలే నవ్వుకునే పరిస్థితి ఇచ్చారు. పరిశ్రమలు తేవాలన్నా, సంపద సృష్టించా లన్నా చంద్రబాబు కే సాధ్యమవుతుందని నాగేశ్వరరావు అన్నారు.
మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నది ప్రజల ఆకాంక్ష. తాము ఓడిపోతామని వైసిపి నేతలే చెబుతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు పడు తున్న ఇబ్బందులను వారి ద్వారానే చెప్పిస్తూ, జగన్ కు మళ్లీ ఓటు ఎందుకు వేయ కూడదో నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి మంచి స్పందన కనిపించింది. చాలామంది మహిళలు గతంలో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని చెబుతూ, ఈసారి తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామని బహిరంగంగానే తెలియజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు మచ్చా మనోహర్ నాయకులు వలేటి వెంకటేశ్వర్లు,గుమ్మా శివ, నందికనమల లక్ష్మణరావు, బొల్లినేని నాగేశ్వరరావు, వెల్లంపల్లి కృష్ణ, నారాయణ జయరాం, మణికంఠ, పార్టీ నాయకులు చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, షేక్ మున్నా, చుండూరి శీను, ముచ్చు వేణు, షేక్ సలాం, సవిడిబోయిన వెంకటకృష్ణ, పులి నాగరాజు, షేక్ ఫిరోజ్, ఫాజిల్, షేక్ ఖలీల్, షేక్ మమ్ముషా, కాలేషా, రసూల్, ముప్పవరపు వేణు, అత్తోట మాల్యాద్రి, రామ్మూర్తి, దాసరి ప్రమోద్, షేక్ మమ్ముషా, సవలం కేశవులు ఇతర నాయకులు పాల్గొన్నారు..

