మట్టిలో మాణిక్యాలనీ వెలికితీయటమే జగనన్న లక్ష్యం
- మహీదర్ రెడ్డి
కందుకూరు
మట్టిలో మాణిక్యాలనీ వెలికితీయటమే జగనన్న లక్ష్యం అని కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డి అన్నారు. స్థానిక టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డి, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాదరి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మహిధర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళికని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డ్ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజులపాటు మెగా క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/ వార్డ్ సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 47 రోజులపాటు ఐదు దశల్లో రాష్ట్ర మొత్తం మీద పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలను రూపొందించారని, అందులో భాగంగా పాఠశాలలో, కళాశాలలో, సచివాలయ సిబ్బందికి, పాఠశాల సిబ్బందికి ఉత్సాహం కలిగి ఉండే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. 5 క్రీడాంశాల్లో రాష్ట్రం మొత్తం మీద 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకోవడం జరిగింది. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది, యోగ, మారథాన్, టెన్నికాయిట్లో 16 లక్షల మంది ఉత్సాహవంతులు పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని మహేధర రెడ్డి తెలియజేశారు. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన క్రీడ పోటీలలోని యువతకు ఎమ్మెల్యే క్రీడా కిట్టు లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. విజయ శేఖర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, టి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, ఎంఈఓ సుబ్బారెడ్డి, ప్రభుత్వ అధికారులు, ఎంపీపీ ఇంటూరి సుశీల జడ్పిటిసి, తొట్టెంపూడి అనసూయ వైసీపీ నాయకులు ఇంటూరి మాధవ తొట్టెంపూడి శీను, ఎంపీటీసీ, జెసిఎస్ మండల పట్టణ కోఆర్డినేటర్లు చీమల వెంకట రాజా, ముప్పవరపు కిషోర్, సర్పంచులు ఆవుల మాధవరావు, కుమ్మర బ్రహ్మయ్య, నాయకులు గంగిరెడ్డి, వెంకట్ రెడ్డి, పాశం కొండయ్య, శ్రీధర్, మండల నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

