జనం కోసం జనార్ధన్

0


ఒంగోలు డిసెంబర్ 30 BSB NEWS 
 జనం కోసం జనార్దన్ బాబు షూరిటి భవిష్యత్ కి గ్యారంటీ కార్యక్రమం శనివారం కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామం నందు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ఇంటింటికి వెళ్లి మహిళలు,యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు. డివిజన్ లో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు అత్యవసరమన్నారు.ఈ కార్యక్రమంలో ద్వారాబాకుల శ్రీనివాసులరెడ్డి, మూగ పోలరాజు, మేకల జక్రయ్య, గ్యానం సుబ్బారావు, దాసరి పోలయ్య,జంపాణి రామచంద్ర గౌడ్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)