కందుకూరు డిసెంబర్ 30 BSBNEWS :-
రాష్ట్రంలో శాంతియుతంగా మా సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే మమ్మల్ని భయపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ద్వారా అక్రమ అరెస్టులను చేయటం దారుణమని మీ అక్రమ అరెస్టులకు మేము బెదిరేది లేదని ప్రాజెక్టు అంగన్వాడి నాయకులు ఎస్.కె రామతున్నిసా, శశికళ తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని
పట్టణంలో ఉన్న సచివాలయాలు అన్నిటిలో సచివాలయ కార్యదర్శులకు అర్జీలు అందజేశారు. అనంతరం నెల్లూరులో అరెస్టు చేసిన సిఐటియు నాయకులను విడుదల చేయాలని నిరాహార దీక్ష శిబిరం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు సిఐటియు నాయకులు ఎస్ ఏ గౌస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని అడిగే సిఐటియు నాయకులు, అంగన్వాడి నాయకులు మీద అక్రమ అరెస్టులు చేస్తున్న ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పంతాలకు పోకుండా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అంగన్వాడి నాయకులు ఎస్.కె రామతున్నిసా, శశికళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసే వరకు, వేతనాలు పెంచే వరకు పోరాడుతామని తెలిపారు. రాస్తారోకో అనంతరం మున్సిపల్ కమిషనర్ కి సమస్యలు పరిష్కారం చేయమని ప్రభుత్వానికి తెలియజేయమని అర్జీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జరీనా, అనురాధ, మాధవి, అనురాధ, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, సిఐటియు పట్టణ అధ్యక్షులు డి రామ్మూర్తి, ఎస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



