మీడియాకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంలో మర్మమేమిటి..?
BSBNEWS - KANDUKUR
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పర్యటనలను గోప్యంగా ఉంచుతూ మీడియాకు సంబంధిత అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాలు సదర్శించడం వెనక మర్మమేమిటి? అని కందుకూరులో చర్చ మొదలైంది. గత కొన్ని రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గదిలో మున్సిపల్ అధికారులుతో పాటు టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పలు అంశాలపై చర్చించడం, శనివారం డ్వామా కార్యాలయంలో ఏపీడీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించటం వెనుక ప్రభుత్వ కార్యాలయలలో అసలు ఏం జరుగుతుందా అని ప్రభుత్వ అధికారులు తోపాటు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పలు ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బంది కూడా మార్చడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం కందుకూరులో ఎమ్మెల్యే పర్యటన వివరాలు ముందుగా మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంతో కందుకూరులో మళ్ళీ అటువంటి ఆనవాయితీ కొనసాగుతుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించే క్రమంలో ముందుగా

