కందుకూరులో ఘనంగా అంతర్జాతీయ మెకానికల్ దినోత్సవం వేడుకలు
BSBNEWS _ KANDUKUR
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ద్విచక్ర వాహన అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానికల్ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కోటారెడ్డి నగర్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం, అంకమ్మ గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీనియర్ నాయకులు అధ్యక్షులు ఆంజనేయులు, రెహమాన్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కందుకూరులో నిర్వహించడం ఎంత సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు రోజుల్లో ఇదేవిధంగా ఐకమత్యంగా నడుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నజీర్, కమిటీ మెంబర్లు తోటి మెకానిక్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


