, అన్నప్రసాద వితరణకు 1,01,116 రూ లు విరాళం అందజేత
BSBNEWS - KANDUKURస్థానిక కనిగిరి రోడ్ లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి వెనక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న అన్న ప్రసాద వితరణ భవనముకు కందుకూరు వాస్తవ్యులు అనుముల.వెంకట రామకృష్ణ, జాహ్నవి* ( దుబాయ్ రాముడు) దంపతులు అన్నప్రసాద వితరణ భవన నిర్మాణం కొరకు రూ॥101,116/- విరాళము అందజేశారని కందుకూరు అయ్యప్ప సేవా సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం కమిటీ సభ్యులు, కె.ఎస్ వెంకటేశ్వర్లు(గురుస్వామి), ఇస్కాల.వెంకట నరసింహ, నల్లబోతుల.మురళి, మాదాల వెంకటేశ్వర్లు, కాటా.చెంచురామయ్య, దాసరి.శ్రీనివాసులు, ఉన్నం.వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

