నిమ్మ చెట్లు నరికి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - సిపిఐ డిమాండ్

0

నిమ్మ చెట్లు నరికి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - సిపిఐ డిమాండ్


BSBNEWS - KANDUKUR


వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామంలో పెగడ నరసింహం అనే రైతు పొలంలో నిమ్మ చెట్లు నరికి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వలెటివారి పాలెం మండలం అంక భూపాలపురం సర్వే నెంబర్ 63/3 లో0.24 సెంట్లు భూమికి యజమాని అయిన పెగడ నరసింహం పశువుల మేత వేసుకున్న తరుణంలో పెగడ నరసింహారావు, పెగడ మాలకొండయ్య, పెగడ సత్యనారాయణ, పెగడ అక్కమ్మ, పెగడ మనోజు, పెగడ బాలకృష్ణ, పెగడ ఓంకారం అనే వ్యక్తులు తమ పొలంలోని పశువుల మేతను ట్రాక్టర్ తో అక్రమంగా దున్నడంతో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని సదరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ పెగడ నరసింహం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు నమోదు చేశారని అయినా వారిపై చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. అయితే సోమవారం మరల పెగడ నరసింహం పొలంలో వేసుకున్న నిమ్మ చెట్లను గతంలో పశువుల మేతను ట్రాక్టర్ తో అక్రమంగా దున్నిన వ్యక్తులే తిరిగి నరకటం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో వారిపై కేసు పెట్టిన వెంటనే పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని ఉంటే నేడు నిమ్మ చెట్లును వారు నరికే పరిస్థితి ఉండేది కాదని దీనికి పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణం అని ఆయన ఆరోపించారు. ఎప్పటికైనా నిమ్మచెట్టు నరికిన వారిపై చర్యలు తీసుకొని పెగడ నరసింహం అనే రైతుకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. నేటిపక్షంలో సిపిఐ పార్టీ తరఫున కార్యాచరణ రూపొందించుకొని ఆ రైతుకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎస్కే హుస్సేన్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, మర్రి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)