ఈనెల 22 నుండి 28 వరకు శిక్ష సప్తహ కార్యక్రమాలను ప్రారబించిన సబ్ కలెక్టర్ జి విద్యాధరి
BSBNEWS - KANDUKUR
జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈనెల 22 నుండి 28 వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలల్లో శిక్ష సప్తహ కార్యక్రమాలు జరగనున్నాయి. సోమవారం స్ధానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కందుకూరు సబ్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభోత్సవం చేశారు విద్యార్థులు తయారుచేసిన టిఎల్ఎం ను సబ్జెక్టుల వారీగా పరిశీలించారు. విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. ప్రతిరోజు రోజు ఒక కార్యక్రమం అన్ని పాఠశాలల్లో నిర్వహించబడతాయని ఉప విద్యాశాఖ అధికారి ప్రసాదరావు అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీయటానికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని మండల విద్యాశాఖ అధికారి కూనం సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి టీచ్ టూల్ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనీలు టీచర్లు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కందుకూరు బాలురు పాఠశాల కేజీబీవీ మోడల్ స్కూల్ విద్యార్థులు వారి యొక్క టి యల్ యం ప్రదర్శించారు విద్యార్థులు టీఎల్ఎం తయారు చేయడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారని ఇలాంటి ప్రదర్శనలు మిగిలిన విద్యార్థులకు మార్గదర్శకం అవుతాయని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయిని ద్వారక రాణి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయిని పార్వతి ఇతర ఉపాధ్యాయునిలు ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిసి. రవితేజ, ప్రతిభ ,రమణారెడ్డి అమూల్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


