గ్రీవెన్స్ కు 5 అర్జీలు

0

గ్రీవెన్స్ కు 5 అర్జీలు 

BSBNEWS - KANDUKUR



కందుకూరు పురపాలక సంఘం కార్యాలయం నందు సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కందుకూరు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు కార్యక్రమం జరుగుతుందని తమ సమస్యలను నేరుగా మా దృష్టికి అర్జీల రూపంలో ఇవ్వాలన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్యం ఇతర సమస్యల కొరకు 9177 700267 ఫోన్ నెంబర్ ద్వారా కూడా తెలియచేయచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)