పుర ప్రజలు సహకరించాలి?
కందుకూరు మున్సిపల్ కమిషనర్
కె వి కృష్ణారెడ్డి
BSBNEWS - KANDUKUR
కందుకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎస్ ఎస్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్డ్ మరమ్మత్తులు కారణంగా పట్టణములో సరఫరా అవుతున్న నీటి వినియోగదారులు 8వతేదీ నుండి నీటి సరఫరా లో జరుగు అంతరాయమును అర్థం చేసుకొని సహకరించాలని కందుకూరు పురపాలక సంఘం కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. మరమ్మత్తులు పూర్తి అగుటకు దాదాపు పది రోజులు సమయం పట్టుతుందని అప్పటివరకు పాక్షికంగా , రోజు మార్చి రోజు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుందని పట్టణ ప్రజలందరూ అంతరాయాన్ని అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

