కొండి కందుకూరులో పశు గ్రాస వారోత్సవాలు
BSBNEWS - KANDUKUR
మండలంలోని కొండి కందుకూరు గ్రామములో రైతు సేవా కేంద్రం నందు పశు గ్రాస వారోత్సవాలు కార్యక్రమం జరిగింది. ఈ వారోత్సవాలకు కందుకూరు పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ జె. చంద్ర మోహన్ పాల్గొని రైతులకు మేలైన పశు గ్రాసాల సాగు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేలైన పశు గ్రాసాలు సాగు చేయడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగి తద్వారా పాడి పోషణ లాభదాయకంగా ఉంటుందని పశు పోషకులకు అవగాహన కల్పించారు. సూపర్ నేపియర్ బహు వార్షిక పశు గ్రాసం నీటి వసతి ఉన్న వాళ్ళు నాటుకోవడం వలన ఒక హెక్టర్ కి 80 నుండి 100 టన్నుల పశు గ్రాసం లభిస్తుంది అని, గడ్డి కత్తిరించే మిషన్ వాడటం వలన 10 నుండి 20 శాతం గడ్డి వృధా కాకుండా, 5 నుండి 10 శాతం పాల దిగుబడి వస్తుంది అని, కనుపుల గడ్డిని 3 నుండి 4 అంగుళాలు సైజు గడ్డి కత్తిరించడం వలన రుచిగా ఉండి ఆహారం బాగా తీసుకొంటాయని తద్వారా పాల దిగుబడి పెరుగుతుంది అని తెలియజేసారు. కోవూరు పశు వైద్యులు డాక్టర్ యస్. సుధాకర్ సీసనల్ గా వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు పడటం వలన గొంతు వాపు జబ్బు వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు రైతులు వేయించుకోవాలని, గొర్రెలలో నీలి నాలుక వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని, సన్న జీవాల రైతులకు తెలియ జేశారు. అనంతరం జిల్లలముడి గ్రామంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా నిర్మితం అవుతున్న బెజవాడ శ్రీను గొర్రెల షెడ్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు విజయం సాగర్, జయ సుహాస్, లోకేష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

.jpeg)

