కందుకూరులో మార్పు కనబడుతుందా...?
ట్రాఫిక్ కు చెక్ పడేనా..?
పోలీస్ లు రూటు మార్చేనా..?
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. పోలీసు అధికారులు మాత్రం కందుకూరులో అడుగుపెట్టి బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రాఫిక్ ను నిర్మూలిస్తామని తెలుపుతారు. తరువాత అది మాటలకే పరిమితమై ఉండేది. అయితే అదే కోవలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేరుతున్నాడా లేక ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు ఆయన వేసిన అడుగులు ముందుకు సాగుతున్నాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని కందుకూరు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణంలో గురువారం పోలీసులు తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులను ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా నిబంధనల ప్రకారం ఉండాలని చెప్పారు. అయితే ఫుట్ ఫాత్ లను ఉపయోగించుకుంటూ వ్యాపారాలు చేసే బడా బడా వ్యాపారస్తులకు కూడా అయ్యే నిబంధనలు వర్తిస్తాయని, కానీ వాటి జోలికి పోకుండా కేవలం తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న చిరు వ్యాపారుస్తులను మాత్రం నిబంధనను పాటించాలని చెప్పటం కందుకూరు లో సర్వసాధారణమైపోయింది. ఏది ఏమైనా కందుకూరులో ట్రాఫిక్ నియంత్రించాలని పోలీసులు చేసే ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించాలని ప్రజలు, వాహనదారులు కోరుకుంటున్నారు. అయితే ఫుట్ ఫాత్ ను ఉపయోగించుకొని వ్యాపారాలు చేసే బడా బాబులను కూడా నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటే కందుకూరులో మార్పు కచ్చితంగా వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 20 సంవత్సరాల కాలంలో కందుకూరులో ఎగరని టిడిపి జెండాను సైతం అత్యధిక మెజారిటీతో టిడిపి జెండాను ఎగరేసిన ఘనత ఇంటూరి నాగేశ్వరరావుది. కందుకూరులో ఉన్న ప్రధాన సమస్య ట్రాఫిక్ ను సైతం ఎవరు తీర్చలేని విధంగా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. కందుకూరులో ప్రధానంగా వెంకటనారాయణ బజార్, ఆదిత్య రెస్టారెంట్, డిపో సెంటర్ లలో అత్యధికంగా ట్రాఫిక్ నిలిచి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడటం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న ఈ సెంటర్లలో బడా వ్యాపారులు ఫుట్ పాత్ లను ఉపయోగించుకోవటమే కారణమని ప్రజలతో పాటు కొంతమంది అధికారులు తెలుపుతున్నారు. వాటిని నియంత్రించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసి చర్యలు తీసుకుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో నియంత్రించాలంటే పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉండకపోతే కొంతమేర సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకొని పనిచేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


