ఎరువుల దుకాణాలు తనిఖీ

0

ఎరువుల దుకాణాలు తనిఖీ


BSBNEWS - KANDUKUR




కందుకూరు పట్టణంలోని వివిధ ప్రైవేట్ విత్తన,ఎరువులు, పురుగు మందుల షాపుల్లో స్థానిక మండల వ్యవసాయాధికారి వి రాము సమక్షంలో విజిలెన్స్ అధికారి, వి సుధాకర్ రెడ్డి వ్యవసాయ శాఖ స్పెషల్ అధికారి, కనిగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ.వి.రమణ గురువారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా విత్తనాల రిజిస్తర్లు, బిల్లులను పరిశీలించారు. ప్రైవేటు షాపులో  అన్నీ రిజిస్టర్లు , బిల్ బుక్ , స్టాక్ రిపోర్ట్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరల పట్టికలోని నిల్వస్టాకు, ధరలు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అమ్మకపు ఫారం (O) ఓ లేని ఎరువులను రూ 3,00,600/-  తాత్కాలికంగా  అమ్మకుండా నిలుపుదల చేశారు. లైసెన్సు లేని ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మకూడదని, రైతులకు తప్పనిసరిగా అమ్మకపు రసీదు ఇవ్వాలని, విత్తన మొలక శాతం కట్టి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, వ్యవసాయశాఖ చట్టాన్ని అనుసరించి విక్రయ అమ్మకాలు జరగాలని లేనిచో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు. ఈ తనిఖీలో కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు పి అనసూయ, నెల్లూరు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయలోని సహాయ వ్యవసాయ సంచాలకులు  ఎరువుల విభాగం ఎ.నర్సోజి రావు, డీలర్లు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)