హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి - సీనియర్ సివిల్ జడ్జి ఎ. శోభారాణి

0

 హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి - సీనియర్ సివిల్ జడ్జి ఎ. శోభారాణి

BSBNEWS - KANDUKUR

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాలు మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ -కందుకూరు వారి ఆధ్వర్యంలో వాహనచోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి  అనే విషయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎం.ఏల్.ఎస్. సి.చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎ.శోభారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి  పి.పూర్ణిమా దేవి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఎ.శోభారాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలబారిన పడకుండా తప్పించుకోవాలని, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్.రమేష్ బాబు, న్యాయవాదులు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది, న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.                                                                                                                                           

Post a Comment

0Comments
Post a Comment (0)