దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దే - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దే - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - KANDUKUR



దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దేనని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డు లో ఉన్న దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలను సక్ష్యమ్ భారత్ ఆధ్వర్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల దివ్యాంగులకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట మేరకు ఫించన్ లను ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే  పెంపదల చేసి అందరిని ఆదుకున్న  వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పలు కారణాలను చూపించి  దివ్యాంగులకు సైతం పింఛన్లను తీసేసిన ఘనత జగన్ కి దక్కిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సక్ష్యమ్ భారత్ నిర్వాహకులను ఆయన అభినందించారు. సేవా కార్యక్రమం లో ఎటువంటి అవసరం వచ్చినా నా వంతు సహకారం ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దట్టమైన హరిబాబు, టీడీపీ కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, టీడీపీ కందుకూరు పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి  వెంకటేశ్వర్లు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు బెజవాడ ప్రసాద్, పలువురు టిడిపి ముఖ్య నేతలు, హరిణి హాస్పిటల్  అధినేత మల్లికార్జున, సక్షమ్ భారత్ నిర్వాహకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)