ప్రతి ఒక్కరు టాక్స్ బకాయిలు చెల్లించాలి - యం.డి.రఫీ
BSBNEWS - KANDUKUR
నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ బి.చందర్ ఉత్తర్వుల మేరకు కందుకూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో గల కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం, ఉలవపాడు ఐదు మండలాలలో టాక్స్ బకాయిలు ఉన్నటువంటి గూడ్స్ వాహనములు 562, ట్రాక్టర్, ట్రైలర్ పబ్లిక్ వాహనములు 602, మాక్సి క్యాబ్ లు 56 లకు టాక్స్ బకాయిలు ఉన్నాయని కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి యం డి రఫీ తెలియచేశారు. ట్రాన్స్పోర్ట్ వాహనదారుల ప్రతి ఒక్కరు టాక్స్ బకాయిలను కట్టవలసిందిగా తెలియచేశారు. లేనిచో అట్టి వాహనాములకు తనిఖీలు నిర్వహించి సీజ్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ వాహనములు గల వాహనదారులు తప్పనిసరిగా టాక్స్, ఫిట్నెస్, పర్మిట్ ఇన్సూరెన్సు, పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ సరిఅయిన ధ్రువపత్రాలను చెల్లుబాటులో ఉండవలేనని తెలిపారు.

