కొత్తపాలెం పాఠశాలకు నోటు పుస్తకాలు పంపిణీ

0

కొత్తపాలెం పాఠశాలకు నోటు పుస్తకాలు పంపిణీ

BSBNEWS - KANDUKUR


పట్టణంలోని కొత్తపాలెం  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తల్లపనేని వెంకటేశ్వర్లు (ఎల్ఐసి ఏజెంట్ ) దాతృత్వంతో  99 మంది పేద విద్యార్థులకు, ఉచిత నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిళ్లు, ఎక్కాల పుస్తకాలు మొదలగు సామాగ్రిని కందుకూరు డిప్యూటీ డిఇఓ ఎం వి వి ప్రసాద్ రావు చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు పాఠశాల సిబ్బంది , చిరు సత్కారంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ డిఇఓ ఎం.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలు బాగా చక్కగా చదువుకుని,  ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని , ఉపాధ్యాయులు చెప్పేటువంటి మంచి విషయాలను నేర్చుకోవాలన్నారు.  మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ అభివృద్ధి చెందామని, మీరే నేటి బాలలు రేపటి పౌరులుగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలతో ,ఉద్యోగస్తులుగా నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)