కందుకూరులో ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరినాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

0

 కందుకూరులో ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరినాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

BSBNEWS - KANDUKUR


కందుకూరులోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణపార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పార్టీ సీనియర్ నాయకులు, కేక్ కట్ చేసి ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 150 మంది రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కోవూరురోడ్డు లోని స్వర్ణస్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. కందుకూరులోని స్కందపురి సోమేశ్వరాలయం సాయిబాబాగుడి, ఇంకా పలుప్రాంతాలలో అనాధలు, యాచకులకు భోజనప్యాకెట్లు  అందించారు. కందుకూరు పట్టణం ఒకటవవార్డు జనార్ధన్ కాలనీ, ఎర్రగుంటపాలెం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ స్కూల్లో స్థానిక టిడిపి నేతల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీట్లు పంచారు. తలతోటి మస్తాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఐ.ఎన్.ఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)