ఉపాధ్యాయున్నిదుర్భాషలాడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి - బి టి ఏ

0

విధుల్లో ఉన్న  ఎస్.జి.టి ఉపాధ్యాయున్ని అసభ్య పదజాలముతో దుర్భాషలాడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి - బి టి ఏ 


BSBNEWS - KANDUKUR


నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం 'కోరుమానిపల్లె'లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయున్ని అసభ్య పదజాలంతో దూషించిన రేషన్ డీలర్ ను కఠినంగా శిక్షించాలని బహుజన్ టీచర్స్ అసోసియేషన్( బి టి ఏ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు కల్లగుంట మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదులో భాగంగా కందుకూరు మండలం పాలూరు  ఎంపీయూపీ పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎమ్ఇవో అనుమతి లేకుండా రేషన్ బియ్యాన్ని  పాఠశాల గదుల్లో పెట్టొద్దన్న  ఉపాధ్యాయుడిపై డీలర్ నోటికి వచ్చినట్లు తిట్టడంతో టీచర్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతొందన్నారు. సంఘటన జరిగి ఆరు రోజులవుతున్న బాధిత ఉపాధ్యాయుడికి రక్షణ ఇవ్వకుండా చోద్యం చూస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి  ఉద్యోగులను, ఉపాధ్యాయులను గౌరవించాలని నేతలను హెచ్చరించినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయుడి అనుమతి లేకుండా తరగతి గదిలోకి అక్రమంగా ప్రవేశించి విధులకు ఆటంకం కల్గించి భయభ్రాంతులకు గురిచేసిన డీలర్ పై  కేసు నమోదు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రాజకీయ నాయకులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.  


Post a Comment

0Comments
Post a Comment (0)