*తెలుగుదేశం గూటికి కర్లపాలెం సర్పంచ్*
*ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన 36 కుటుంబాలు*
*గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్న ఇంటూరి నాగేశ్వరరావు*
BSBNEWS - కందుకూరు
శుక్రవారం, 19-07-2024.
కందుకూరు నియోజకవర్గంలో మొదటినుంచి వైసీపీకి పూర్తిగా కంచుకోట అయిన, గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీ కర్లపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. వైసిపి మద్దతుతో సర్పంచ్ గా ఎన్నికైన చాపల రమణయ్యతో సహా 36 కుటుంబాల వారు, శుక్రవారం కందుకూరులోని టిడిపి కార్యాలయంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. సర్పంచ్ చాపల రమణయ్యతో పాటు గ్రామపెద్ద చాపల మీరయ్య, లంకె సుబ్బారావు, చాపల శ్రీనివాసులు, పిన్ని వెంకటశేషయ్య, ఐలా వరప్రసాద్, వల్లభుని వెంకటశేషయ్య, పిన్ని శ్రీనివాసులు, చాపల వెంకటేశ్వర్లు, చాపల నరసింహం, ఇంకా పలు కుటుంబాలవారు టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విధానాలు నచ్చి టిడిపిలో చేరుతున్నామని, ఆయన ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఏర్పడిందని సర్పంచ్ రమణయ్య తెలిపారు. గ్రామస్తుల్లో మార్పు రావడం సంతోషంగా ఉందని, కర్లపాలెం గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

