సమస్యను పరిష్కరించాలని కమిషనర్ కి వినతి
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పట్టణంలోని తూర్పు యాదవపాలెం జలమయమయ్యాయి. దాంతో ఆ కాలనీవాసులు కందుకూరు పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక వార్డు నాయకులతో కలిసి సమస్య పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ కాలనీలోకి భారీగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి బ్రహ్మయ్య, గుమ్మడి శివ, కాకుమాని మాల్యాద్రి, పొడపాటి రాధా తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
.jpeg)

