మున్సిపల్ కమిషనర్ కు అభినందనలు తెలిపిన యానాది సంక్షేమ సంఘం సభ్యులు
BSBNEWS - KANDUKUR
నూతనంగా కందుకూరు మున్సిపల్ కమిషనర్ గా రెండవ సారి భాద్యతలు చేపట్టిన కే.అనూషకు యానాది సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానాది కాలనీలో యానాదులు ఎదురుకొంటున్న తాగునీటి సమస్య గురించి వివరిస్తూ సమస్యను పరిష్కరించాలని ఆమెను కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ కే.అనూష కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న యానాది కాలనీలు అన్నిటికి తాగునీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యానాది సంక్షేమ సంఘం నాయకులు చేవూరు దుర్గాప్రసాద్, మల్లవరపు సీత, పగడాల నాగూర్, జంపాని హరిప్రసాద్, కొమరగిరి తిరుపతి స్వామి, చలంచర్ల పద్మ, తదితరులు పాల్గొన్నారు.

