మోపాడులో ఘనంగా పోషన్ మహా
BSBNEWS - KANDUKUR
కందుకూరు మండలంలోని మోపాడు గ్రామంలో సూపర్వైజర్ యు ప్రభావతి ఆధ్వర్యంలో పోర్షన్ మహా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ శర్మిష్ట, వరల్డ్ విజన్ మేనేజర్ యాసియా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్క గర్భవతి, బాలింత వినియోగించుకోవాలని తద్వారా పోషకాహార లోపం లేని చిన్నారులను తయారు చేసేందుకు కృషి చేద్దామని ఆమె అన్నారు. పౌష్టికాహారం పై గర్భవతులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. పౌష్టికాహారం విషయంలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తెలియని గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం గురించి వివరిస్తూ వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

