అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా పోషణ్ మహా

0

అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా పోషణ్ మహా

BSBNEWS - KANDUKUR

కందుకూరు అర్బన్ పరిధి దర్గా ఏరియా లోని అంగన్వాడి సెంటర్ లో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ పాల్గొని మాట్లాడుతూ గర్భవతులు వివిధ ఆహారాన్ని వివేకంతో ఎంచుకొని వినియోగించుకోవాలని అన్నారు గర్భంతో ఉన్న తల్లి బిడ్డతో పాలు ఇచ్చేటప్పుడు అదనపు ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పౌష్టికాహారాలైన ఆకుకూరలు కూరగాయలు పండ్లు సమృద్ధిగా తీసుకుంటే బిడ్డకు పాలు సక్రమంగా ఇవ్వగలుగుతారని అన్నారు. పౌష్టికాహారం అయిన ఏడు రకాలైన మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు విటమిన్లు, ఖనిజలవనాలు తో పాటు నీరు తగినంత తీసుకోవాలని అన్నారు. పౌష్టికాహారం విషయంలో అంగన్వాడి కేంద్రాలు ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చే సూచనలను గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎస్కే మైమోన్ ఎస్ కే రహంతున్నీసా తదితర అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)