విజయవాడ బాధితులకు సాయం అందించిన కందుకూరు ఆర్యవైశ్యులు

0

విజయవాడ బాధితులకు సాయం అందించిన ఆర్యవైశ్యులు

BSBNEWS - KANDUKUR 

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడు ముందంజలో ఉండే కందుకూరు ఆర్యవైశ్యులు మరోసారి విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ముందడుగు వేసి పెద్దమనసు చాటుకున్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనతో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సుమారు రెండు లక్షలు విలువైన వస్తు సామాగ్రి, పదిమంది సేవకులతో గురువారం కందుకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి లారీ లో బయలుదేరారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మాట్లాడుతూ అనుకోని ప్రకృతి విపత్తు వలన నష్టపోయిన వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత అని అందులో భాగంగా కందుకూరు నుండి ఆర్యవైశ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉచితమైనదని ఆయన అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని కందుకూరులో ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి విజయవాడ బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్య వైశ్యులతోపాటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొని సామాగ్రిని లారీలో చేర్చి విజయవాడకు పంపించారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)