కేసరిగుంట కాలనీలో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలోని కేసరిగుంట కాలనీ అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిడిపిఓ శర్మిష్ట మాట్లాడుతూ పౌష్టికాహార లోపం లేని పిల్లలను తయారు చేయటమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని వారికి గర్భవతులు, బాలింతలు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు అంగన్వాడి ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భవతులు , బాలింతలు విధిగా పౌష్టికాహారాన్ని తీసుకునే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆమె అన్నారు. పౌష్టికాహారం వల్ల కలిగే లాభాలను గర్భవతులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు బి. సుభాషిని, బి.పద్మావతి, వై. రాజేశ్వరి, ఏఎన్ఎం శాంతి, హెల్పర్ సుధా తదితరులు పాల్గొన్నారు

