శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణంకై రూ16వేలు విరాళం

0

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణంకై రూ16వేలు విరాళం 

BSBNEWS - KANDUKUR

గుడ్లూరు మండలంలోని చెమిడిదపాడు గ్రామం బస్టాండు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ప్రసన్న అంజనేయ స్వామి వారి ఆలయం నిర్మాణం కోసం దాతల నుంచి విరాళాలు అందుతున్నాయి. కందుకూరుకు చెందిన జి ఎస్ ఎన్ కన్స్ట్రక్షన్స్ అదినేత గుండవరపు నరసింహారావు, ధర్మపత్ని శారద 50 బస్తాల సిమెంటుకు 16 వేల రూపాయలు విరాళం ట్రస్ట్ అద్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావుకు చెక్కు  ద్వారా ఇవ్వడం జరిగింది.  అద్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావు మాట్లాడుతూ వారికి ఆ సీతా రామ లక్ష్మణ భరత శతృఘ్న సమేత శ్రీ సువర్చలా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని ట్రస్ట్ తరపున వారికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం భక్తులు శ్రీ రామ నామ జపం చేస్తూ ఇటుకలతో పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క సిమెంటు బస్తా ఆలయ నిర్మాణం కోసం భక్తులు సమర్పిస్తున్నారని అలా ఇచ్చిన భక్తులు, దాతల గోత్ర నామాలతో  పూజ చేయటం తో పాటు ఒక బస్తా కు ఒక సారి చాలీసా పారాయణము చేసి ఆలయ నిర్మాణంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఆలయం మండపం నిర్మాణం పూర్తి అయిందని 54 అడుగుల ఎత్తు విరాట్ ఆంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞంలో భాగంగా ఇంటింటికి  వెళ్లి ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణము పూర్తి ఉచితముగా చేస్తున్నట్టు తెలిపారు. చాలీసాతో పాటు 108 కోట్ల శ్రీ రామ నామ తారక మహా మంత్ర జపం యజ్ఞంలో భాగస్వాములు అయిన భక్తులు ఇప్పటి వరకు 28,56,73,198 సార్లు శ్రీ రామ నామ మహా మంత్ర జపం చేశారని, చాలీసా పారాయణము 1,43,84, 823 సార్లు చేశారని ట్రస్ట్ అధ్యక్షుడు తెలిపారు. భవిష్యత్ బ్రహ్మ అవతారంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మాణం పనులు చెమిడిదపాడు లో జరుగుతున్నాయన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)