పలుకూరులో పోలం పిలుస్తోంది

0

పలుకూరులో పోలం పిలుస్తోంది


BSBNEWS - KANDUKUR 




 మండలంలోని పలుకూరు, మహాదేవపురం గ్రామాలలో పోలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులకు కావాలసిన శనగ విత్తనాలను పంపిణీ చేయుటకు కాక్ 2 రకం పూర్తి ఖరీదు రూ. 12100/- లలో 25శాతం రాయితీ మినహా రైతు కట్టవలసినది రూ 9075/- అని, జె జి 11రకం పూర్తి ఖరీదు రూ 9400/- లలో  25శాతం రాయితీ పోను రైతు కట్టవలసినది రూ 7050 /- లు అని, కాక్ 2 రకం 1800 క్వింటాళ్ళు, జె జి 11 రకం 5 క్వింటాళ్ళు మండలానికి మంజూరయ్యాయి అని వాటి కోసం రైతులు మీ రైతు సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. విత్తనాలను ట్రైకొడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసినచో వేరు కుళ్ళు నుండి కాపాడుకోవచ్చని తెలియజేసారు. మండల వ్యవసాయ కార్యాలయంలో పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. తదుపరి మినుము మిని కిట్స్ వి బి ఎన్ 8 రకం విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. తదుపరి పొలంలో వేసిన మినుము పంటను పరిశీలించారు. ప్రస్తుతం మినుము 15-20 రోజుల పెరుగుదల దశలో ఉన్నది కావున కలుపు నివారణకు గొర్రుతో అంతర కృషి చెయ్యాలని లేదా గడ్డి జాతి మొక్కల నివారణకు ఇమాజిటాఫిర్ 5% లేదా ఫోమాసఫెన్ క్విజలోపాప్ 12.5%, ఇథైల్ 5% ఎకరాకు 400మీ. లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లా సహకార సంఘంలో పేర్లు నమోదు చేసుకొంటే రాయితీతో గొర్రెల లోన్ వస్తుందని, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా సూపర్ నేపియర్, కోయంబత్తూర్ 5 రకం బహు వార్షిక గడ్డి సాగు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ అధికారిని డి.ధనమ్మ మాట్లాడుతూ పంటలపై అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేప కషయాలు పిచికారి చేస్తే పురుగుల గుడ్లు నివారించవచ్చని తెలిపారు. రాత్రిపూట రసం పీల్చే పురుగుల నివారణకు సోలార్ ఫిరమోన్ ట్రాప్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలుకూరు గ్రామ ఉద్యాన సహాయకురాలు ఐ.బ్రహ్మణి , మహాదేవపురం గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ నశీర్ భాష, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)