నవంబర్ 2న "ది కందుకూరు ప్రెస్ క్లబ్" యూనియన్ ఏర్పాటు

0

నవంబర్ 2న "ది కందుకూరు ప్రెస్ క్లబ్" యూనియన్  ఏర్పాటు 

BSBNEWS - KANDUKUR 

కందుకూరు నియోజక వర్గంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నవంబర్ 2న "ది కందుకూరు ప్రెస్ క్లబ్" యూనియన్  ఏర్పాటు చేయడం జరుగుతుందని కందుకూరు జర్నలిస్ట్ లు తెలిపారు. స్థానిక కోటారెడ్డి భవన్ లో కందుకూరులోని జర్నలిస్టుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. నవంబర్ 2 తేదీ "ది కందుకూరు ప్రెస్ క్లబ్" యూనియన్ ను ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. నవంబర్ 2న జరిగే యూనియన్ ఏర్పాటుకు కందుకూరు నియోజకవర్గం లోని జర్నలిస్టులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పత్రికల, పలు చానల్స్ ల విలేకరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)