పోలీస్ శాఖ వలనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు - ఎమ్మెల్యే ఇంటూరి

0

 పోలీస్ శాఖ వలనే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు - ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR 




దేశవ్యాప్తంగా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి పోలీసులు శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని అని తెలిపారు. పోలీసుల అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో శుక్రవారం కందుకూరు డి.ఎస్.పి సిహెచ్. వి బాలసుబ్రమణ్యం, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ జరిగింది. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పోలీసులు వారి విధుల నిర్వహణలో తమ కుటుంబాలకు సైతం  దూరంగా ఉండి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పోలీస్ విధులకు సహకరించే మనస్తత్వం కలిగి ఉండాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో పోలీసులు శాంతి భద్రతను కాపాడటంతో పాటు, సమాజంలో ప్రతి ఒక్కరికి తాము అండగా  ఉన్నామనే విధంగా  తమ సేవలను అందజేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో  ప్రభుత్వం పోలీసు వ్యవస్థని మరింత బలోపేతం చేసి ప్రజలకు అనేక సేవలు అందించేలా  కృషి చేయనున్నట్లు ఆయన  తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు సీఐ మంగారావు, పట్టణ ఎస్సై వి.సాంబశివయ్య, రూరల్ ఎస్సై మహేంద్రా నాయక్, ఉలవపాడు ఎస్సై కే అంకమ్మ, వలేటివారిపాలెం ఎస్సై మదిరి నాయుడు, లింగసముద్రం ఎస్సై షేక్ మహ్మద్ సుభాని , గుడ్లూరు ఎస్సై వెంకట్రావు, ఎస్సై ఎడ్వర్డ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, విద్యార్థిని, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)