తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపిడిఓ

0

తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపిడిఓ  

BSBNEWS - GUDLURU 



మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను గుడ్లూరు ఎంపీడీవో వెంకటేశ్వరరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలలో శానిటేషన్, త్రాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు చేపడుతూ, ప్రజలను అప్రమత్తంగా ఉండవలసినదిగా అవగాహన కల్పించారు. గుండ్లపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద సైడ్ ట్రైన్ పూడిపోవడంతో పూడిక తీసి  అడ్డంకులను తొలగించారు. చెమిడితిపాడు వద్ద ఎలికేరు వాగును పరిశీలించి ఆగ్రామ సర్పంచ్ సమక్షంలో ప్రజలను వాగు దాటినవ్వకుండా అవగాహన కల్పించి పోలీసు వారి సహాయంతో, పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందిని కాపలాగా ఉంచారు. సాలిపేట గ్రామంలో మత్స్యకారులతో రెడ్ అలర్ట్ తొలగే  వరకు మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని ఆదేశించారు. పూరి గుడిసెల్లో ఉన్న వారందరిని వర్షం తీవ్రమైనట్లయితే వారందర్నీ లోతట్టు ప్రాంతాల నుండి సైక్లోన్ షెల్టర్ కు వచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, ఏఈ పీఆర్ శ్రీనివాసులు, ఏఈ హౌసింగ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)