ఎర్ర వాగు ఉదృతం - సూచనలు చేస్తున్న పోలీసులు
BSBNEWS - KANDUKUR
కందుకూరులోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతో వాహనదారులు, ప్రయాణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు దగ్గరుండి ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. ఇటీవల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కందుకూరు నుండి గుడ్లూరు వెళ్లే రహదారిలో ఉన్న ఎర్ర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలాగే వర్షం మరో రెండు రోజులు పాటు కురిస్తే లోతట్టు ప్రాంతంలో ఉన్న పొలాలలోకి వరదనీరు చేరి పంట నష్టం వాటిల్లుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భారీ వాహనాలు తప్ప ద్విచక్ర వాహనాలను పోనివ్వకుండా పోలీసులు కట్టు దిట్టం చేస్తున్నారు. అధికారులు అక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడంతో పాటు లోతట్టు ఉన్న పొలాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


