కందుకూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలసుబ్రమణ్యం
BSBNEWS - KANDUKUR
కందుకూరు నూతన డీఎస్పీగా వి.ఎస్ బాలసుబ్రమణ్యం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరావు కొద్దిరోజుల కిందట బదిలీపై వెళ్ళిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను నియమించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన డిఎస్పి మాట్లాడుతూ కందుకూరు డివిజన్ పరిధిలో శాంతిభద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

