రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలి -ఎస్ పి జి కృష్ణ కాంత్

0

 రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలి-- ఎస్ పి జి కృష్ణ కాంత్ 

BSBNEWS - NELLORE 

వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో  జిల్లా యస్.పి. జి.కృష్ణకాంత్  వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి, సిబ్బందికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలి అని అన్నారు. రామాయణంను రచించిన గొప్ప వ్యక్తి వాల్మీకి అని, ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణం అని తెలిపారు. గొప్ప కావ్యాన్ని రచించి యుగాలు మారినా కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి సమాజానికి అందించడం గొప్ప విషయం అని అన్నారు. రామాయణ కర్త వాల్మీకి స్వగుణ ధర్మముతో మహార్షి గా రూపాంతరం చెందడమే గాక ఆదికవిగా ఎంతో గౌరవించబడి సాంప్రదాయ రచయితగా కీర్తించబడ్డారని కొనియాడారు. ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి శ్రీ వాల్మీకి మహర్షి  అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సిహెచ్ . సౌజన్య, అడిషనల్ యస్.పి.(ఏ ఆర్ )  శ్రీనివాసరావు, ఎస్ బి డి ఎస్ పి  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)