కూటమి ప్రభుత్వం తెచ్చిన పల్లె పండుగ
BSBNEWS - PONNALUR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల్లో పండగ వాతావరణం నెలకొందని మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు తెలిపారు. మండలంలోని వెంకుపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో మంజూరైన 20 లక్షల సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, యువత అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపల్లెలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వెంకుపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో మంజూరైన రోడ్డును ఆయన ఎంపీడీవో సుజాతతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు తానికొండ మహేంద్ర, మాదాల ప్రసాద్, మాదాల కోటేశ్వరరావు తోపాటు ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు.


