ఎండైనా.. వానైనా.. వారికి కష్టాలు తప్పవు

0

ఎండైనా.. వానైనా.. వారికి కష్టాలు తప్పవు 

BSBNEWS - KANDUKUR [18.10.2024]


 ప్రజల ఆరోగ్యాల కోసం నిరంతరం శ్రమించే శ్రామికులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు. కరోనా సమయంలో దేశమంతటా వారి సేవలను అభినందించింది. అయితే వారి ఆరోగ్యాలను మాత్రం పట్టించుకునేవారు లేరని చెప్పొచ్చు. ఇటీవల నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కందుకూరులో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని పారిశుద్ధ్య కార్మికుల చేత మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. అయితే ప్రజల ఆరోగ్యాల కోసం తమ బాధ్యతలను నిర్వర్తించటంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాలని కాపాడే పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. జోరు వానలో అధికారులు వానకు తడవకుండా జాగ్రత్తలు పాటించారు. పారిశుధ్యం చేసే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఆ వానలో తడుస్తూ పనిచేసిన దృశ్యం పలువురుని ఆశ్చర్యపరిచింది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వసతులు కల్పించడంలో అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారు అని మున్సిపల్ కార్మికుల యూనియన్ నాయకులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన వారు పారిశుద్ధ్య కార్మికులు వానలో తడిసి ఏదైనా అనారోగ్యానికి పాలైతే వారి పరిస్థితితో పాటు వారి కుటుంబ పరిస్థితి ఏమిటా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మున్సిపల్ కమిషనర్ వివరణ:-

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వానకు తడవకుండా అందరికీ రైన్ కోట్లు ఇవ్వడం జరిగింది. పారిశుధ్య కార్మికుల విషయంలో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులను, సదుపాయాలు కల్పిస్తున్నాము. 

Post a Comment

0Comments
Post a Comment (0)