కందుకూరులో సభ్యత్వ నమోదు రికార్డు సృష్టించడానికి సిద్ధం కండి.
BSBNEWS - KANDUKUR
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సభ్యత్వం తీసుకోవాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్.రఫీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తు బాగుండాలని ఎక్కడ వారి కుటుంబాలు కష్టపడకూడదని కార్యకర్తలలో భరోసా పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము అని ముందుకు వచ్చే నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉండటం అదృష్టం అని అన్నారు. గతంలో కూడా చంద్రన్న బీమా అనే పథకంతో అనేక కుటుంబాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకి ఉన్నదన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ రుసుము 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు పొందే అవకాశాలను వివరించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్త అకస్మాత్తుగా చనిపోతే ఆ కార్యకర్త మట్టి ఖర్చులకు 10000 వేల రూపాయలు ఇవ్వబడుతుందన్నారు. సభ్యత్వ తీసుకున్న కార్యకర్తకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా, అది కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచబడిందన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కుటుంబం కోసం విద్యా.వైద్య. ఉపాధి. కోసం సహాయం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి. నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని వారికి ఎటువంటి కష్టాలు రాకూడదని వారు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

