సొంత నిధులతో ఉత్తర కాలువపై కల్వర్టు నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పనికి హర్షం వ్యక్తం చేసిన రాళ్లపాడు రైతాంగం

0

 సొంత నిధులతో ఉత్తర కాలువపై కల్వర్టు నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పనికి హర్షం వ్యక్తం చేసిన రాళ్లపాడు రైతాంగం

BSBNEWS KANDUKUR 


ఇటీవల రాళ్లపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు ప్రవహిస్తున్న  ఉత్తర కాలవను  అధికారులు, రైతులు కలిసి పరిశీలించారు. అందులో భాగంగా కలిగిరి మండలం జిర్రావారిపాలెం వద్ద కాలువ నీటి ప్రవాహం తగ్గటానికి గల కారణాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. జిర్రావారిపాలెం రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉత్తర కాలవపై చిన్న చిన్న పైపులతో కల్వర్టు నిర్మించుకున్నారని, ఆప్రాంతంలో కాలువలో పూడిక వలన నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుందని అధికారులు శాసనసభ్యులుకి వివరించారు. దాంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడి గ్రామ రైతులకు ఇబ్బంది లేకుండా కాలువ ద్వారా నీరు సక్రమంగా రాళ్లపాడు ప్రాజెక్టు చేరేందుకు సొంత నిధులు 5 లక్షల రూపాయలతో  మట్టిపూడిక, పెద్ద పైపులతో కల్వర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారంఅధికారులు  వెంటనే పనులు ప్రారంభించారు. గురువారం సాయంత్రం కల్లా పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దాంతో సమస్యను తెలుసుకున్న వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి  రాళ్లపాడు ఆయకట్టు రైతులు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)