జి.మేకపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది
BSBNEWS - KANDUKUR [18.10.2024]
మండలంలోని జి.మేకపాడు గ్రామంలో మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో శుక్రవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ ఈ సీజన్ లో ఎరువులను సహకార పరపతి సంఘాలు ద్వారా గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంటలు వేసిన ప్రతి ఒక్కరూ మీ పంటలను పంట నమోదు చేసుకోవాలని కోరారు. వేరు కుళ్ళు, మొదలు కుళ్ళు, విత్తన శుద్ది కొరకు, ట్రైకో డెర్మా విరిడీ పౌడర్ మండల వ్యవసాయాధికారి కార్యాలయం లో 50%రాయితీ తో సిద్ధంగా ఉంది అని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా, ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శనగ పచ్చ పురుగు నివారణకు తొలి మొగ్గ లేదా పూత దశలో 5శాతం వేప గింజల కషాయం ఒక లీటరు లేదా 10,000పి పి యమ్ వేప నూనె 400 మి.లీ.పిచికారి చేసుకొని, తదుపరి క్వినాల్ఫాస్ 2.మి.లి లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. వెర్రి తెగులు రాకుండా నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 500 గ్రాములు లేదా డైకోఫాల్ మందును 1.0 మి.లీ నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. కోవూరు పశు వైద్యాధికారి ఎస్ సుధాకర్ మాట్లాడుతూ ఈనెల 20వ తేది నుండి అక్టోబర్ 31వ తేది వరకు గొర్రెలు, మేకలకు ఉచితంగా డివర్మింగ్ (నట్టల నివారణ ) మందులు ప్రతి గ్రామములో పంపిణీ చేస్తున్నారని వాటిని సన్న జీవాల రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. సార్టెడ్ సెక్స్ సెమిన్ (కుత్రిమ గర్భదారణ) ఇంజెక్షన్స్ వలన మేలు జాతి ఆడ దూడలు మాత్రమే పుడతాయని ఒక్కో ఇంజెక్షన్ ధర 1350/- రూపాయలు అయితే ప్రభుత్వం వారు రాయితీ తో 500/-రూపాయలు ఇంజెక్షన్స్ చేస్తారని, గేద ఒకసారి తిరగకట్టితే రెండో సారి ఉచితంగా రెండు సార్లు తిరగకడితే 500/- రూపాయలు నేరుగా రైతు బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారన్నారు. ప్రస్తుతం ప్రతి పశు వైద్య కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, ఈ ఇంజెక్షన్స్ వలన మూర్రా జాతి లక్షణాలు ఉన్నా పడ్డ దూడలు, ఎక్కువ పాల ఉత్పత్తి ఇచ్చే దూడలు జన్మిస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దాన ఖర్చుల కోసం తక్కువ సంప్రదించాలని తెలియజేసారు. అనంతరం కంది పంటలో ఖరీఫ్ లో జాతీయ పోషణ, భద్రత పథకం కింద జి మేకపాడు గ్రామంలో అమలుచేస్తున్న పథకం గురించి వివరించారు. ఈ పథకం ద్వారా గ్రామంలో 20 హెక్టార్ల ఎంపిక చేసి, రైతులకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారన్నారు. సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు , పురుగు మందులు 50%రాయితీ తో అందిస్తామని తెలియజేసారు. కంది పంట పరిశీలన చేసి, ప్రస్తుతం కంది 90రోజుల పంట, కావున చివరి మొగ్గలు కత్తిరించినచో శాఖలు వృద్ధి చెంది, అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ జి .బ్రహ్మయ్య, గ్రామ వ్యవసాయ సహాయకులు టీ. రోశిరెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)