గ్రామాల అభివృద్ధికై పల్లె పండగ వారోత్సవం - ఎంపీడీవో రత్నజ్యోతి

0

 గ్రామాల అభివృద్ధికై పల్లె పండగ వారోత్సవం - ఎంపీడీవో రత్నజ్యోతి

BSBNEWS - KANDUKUR [18.10.2024]

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో రత్నజ్యోతి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండముడుసు పాలెం, పలుకూరు, విక్కిరాల పేట, ఓగూరు పందలపాడు గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం ఎంపీడీవో రత్నజ్యోతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం కొండముడుసు పాలెం ఉపసర్పంచ్ పొడపాటి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నినాదంతో పల్లె పండుగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీడీవో రత్నజ్యోతి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ జాతీయ పథకం ద్వారా నిర్వహించిన గ్రామసభలతో గుర్తించిన పనులను వేగవంతం చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)