విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి
BSBNEWS - KANDUKUR [18.10.2024]
చదవడం, రాయడంలో ఇబ్బంది పడుతూ డిస్లెక్సియా రుగ్మతతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారిలో ప్రతిభను వెలికి తీసి ప్రొత్సహించాలని బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. నరసింహమూర్తి అన్నారు. శుక్రవారం బాలుర హైస్కూల్, భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో డైస్లెక్సియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థుల్లో భయాందోళనలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం ఐఈఆర్టీ కూనం ఉదయలక్ష్మి మాట్లాడుతూ డిస్లెక్సియాతో బాధపడుతున్న చిన్నారులలోని అభ్యసన లోపాలను గుర్తించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచి ఆ లోపాలను అధిగమించేలా రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచటం ద్వారా వారిలోని లోపాలను గుర్తించి అభ్యసన సామర్దాన్ని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు తలపనేని శ్రీనివాసరావు, ఐఈడిఎస్ఎస్ ఏసుదాసు, రమణయ్య, శ్రీనిధి, పెరుగు ప్రసాద్, సిఆర్ఎంటీ ఎం.వి రమణారెడ్డి, కోటకట్టవీది పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, కల్పన, సిరాజుద్దీన్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

.jpeg)
