లంకా దినకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన అభివృద్ధి కమిటీ

0

 లంకా దినకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన అభివృద్ధి కమిటీ

BSBNEWS - KANDUKUR [18.10.2024]

బీజేపీ నాయకులు, ఛార్టర్డ్ అకౌంటెంట్, ఆంధ్ర ప్రదేశ్ 20 సూత్రాల అభివృద్ది కమిటీ చైర్మన్ లంకా.దినకర్ ను కందుకూరు అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ శివరాం,సెక్రటరీ నేతీ. మహేశ్వర రావు, కోశాధికారి కాకుమాను మాధవరావు తదితరులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సూత్రాల అమలు లో గ్రామీణ అభివృద్ధి కూడ ఉంది కాబట్టి గ్రామీణ అభివృద్ధి కి అవసరమైన సహాయ సహకారం అందించాలని కోరారు. ఆధునిక వ్యవసాయం, పేద వెనుకబడిన వర్గాల నుంచి యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన రుణ సదుపాయం తాలూకా ప్రతిపాదనలకు బ్యాంక్ అధికారులు సహకరించేలా చూడాలని కోరారు. స్పందించిన చైర్మన్ రాబోయే జిల్లా మీటింగ్ లలో బ్యాంకర్లతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments
Post a Comment (0)