ప్రైవేట్ విత్తనాల డీలర్ల షాపుల తనిఖీ

0

 ప్రైవేట్ విత్తనాల డీలర్ల షాపుల తనిఖీ

BSBNEWS - KANDUKUR



పట్టణ పరిధిలోని వివిధ ప్రైవేట్ విత్తనాల డీలర్ల షాపులను కందుకూరు మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు(ఎ డి ఎ)పి అనసూయ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ డి ఎ మాట్లాడుతూ డీలర్లు తప్పనిసరిగా విత్తన నిల్వ పట్టిక (స్టాక్ బోర్డు) లో పంట పేరు, రకం, స్టాక్ నిల్వ మోతాదు, ధర పొందుపరచాలని, దృవీకరించిన విత్తన కంపెనీలు నుండి మాత్రమే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. వచ్చిన స్టాకు ను ఎప్పటికప్పుడు స్టాకు రిజిష్టర్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులకు తప్పనిసరిగా మొలక శాతం చూపించి అమ్మిన తర్వాత రైతుకు రశీదు ఇవ్వాలని తెలియజేసారు. ప్రస్తుతం రైతులకు అందుబాటులో వరిలో అమర, బీజా, ఆర్ ఎన్ ఆర్, ఆదిత్య రకాలు,మినుములో పి యు 31రకం, నువ్వులు :వై ఎల్ ఎం 66, గౌరీ రకాలు అందుబాటులో ఉన్నాయి అని తెలియజేసారు. డీలర్లు అందరూ తప్పనిసరిగా విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 ప్రకారం క్రయ విక్రయాలు జరపాలని లేనిచో వారి మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబాడునని ఆదేశించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)