బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి

0

బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి 

BSBNEWS - KANDUKUR

మండలంలో బాణాసంచా తయారీ కేంద్రాలను కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం కందుకూరు సిఐ కె వెంకటేశ్వరరావు, గుడ్లూరు సిఐ మంగారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్- చేయటం జరుగుతుందన్నారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు అని హెచ్చరించారు. నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు తప్పక పాటించాలి. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో ఇతర ప్రదేశాలలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ  షాప్ లు ఏర్పాటు చేసుకొని  విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పటల్స్ కు, ప్రజల నివాస ప్రాంతాలలో టపాకాయలు విక్రయించరాదని, పట్టణ, మండల సుదూర ప్రాంతాలలో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని గానీ, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, సహాయం అవసరమైనా, అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101,  డయల్ 112 లకు తెలియజేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)