తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

0

 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

సభ్యత్వం తీసుకున్న పలువురు ప్రముఖులు






BSBNEWS - KANDUKUR

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం పండుగ వాతావరణం లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు లక్ష రూపాయలుతో  పార్టీ శాశ్వత  సభ్యత్వ కార్డును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదగా అందుకున్నారు. వారితో పాటు కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పొడపాటి మల్లికార్జున, కాకుమాని బసవేశ్వరరావులు లక్ష రూపాయలతో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్డును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. పార్టీ మీద అభిమానంతో శాశ్వత సభ్యత్వం స్వీకరించిన ముగ్గురిని అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)