కూలీల సంఖ్యను పెంచాలి -ఎంపీడీవో పి.రత్న జ్యోతి
BSBNEWS - KANDUKUR
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలి ఎంపీడీవో రత్నజ్యోతి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో క్షేత్ర సహాయకులు, టి.ఎ లు, మేట్లకు, ఉపాధి హామీ పధకము పై ఏపీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో రత్నజ్యోతి మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కూలీలకు పని కల్పించలేక పోవడం జరిగిందన్నారు. ఈనెల 24వ తేది గురువారం నుండి పని కావాలనే ప్రతి కూలికి పని కల్పించటంతో పాటుగా కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలన్నారు. రైతువారి కుంటలు, మండలానికి 20 సోక్ పిట్స్, మండలానికి 1000 రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, మండలానికి 10 చొప్పున జిల్లా స్డాయి నుంచి టార్గెట్ నిర్దేసించినారని పేర్కొన్నారు. వాటికి ప్రతిప్రాధనలను తయారుచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టరు బాబురావు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

