విక్కిరాలపేటలో పోలం పిలుస్తోంది

0

 విక్కిరాలపేటలో పోలం పిలుస్తోంది

BSBNEWS - కందుకూరు




మండలంలోని విక్కిరాలపేట, కొండి కందుకూరు గ్రామాలలో పోలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులకు కావాలసిన శనగ విత్తనాలను పంపిణీ చేయుటకు కాక్ 2 రకం పూర్తి ఖరీదు రూ. 12100/- ,25శాతం రాయితీ మినహా రైతు కట్టవలసినది రూ 9075/- అని, జె జి 11రకం పూర్తి ఖరీదు 9400/-  25శాతం రాయితీ పోను రైతు కట్టవలసినది రూ 7050 /- అని, కాక్ 2 రకం 1800 క్వింటాళ్ళు మరియు జె జి 11 రకం 5 క్వింటాళ్ళు మండలానికి మంజూరయ్యాయి అని వాటి కోసం రైతులు మీ రైతు సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శనగ వేసే రైతులు సిఫారసు చేసిన ఎరువులు చివరి దుక్కిలో యూరియా 20 కేజీల, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125కేజీలు ఒక ఎకరం చొప్పున వేసుకోవాలని తెలిపారు. విత్తనాలను ట్రైకొడర్మా విరిడి తో విత్తన శుద్ధి చేసినచో వేరు కుళ్ళు నుండి కాపాడుకోవచ్చని తెలియజేసారు. మండల వ్యవసాయ కార్యాలయంలో పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు.  ప్రకృతి వ్యవసాయ అధికారిని డి.ధనమ్మ మాట్లాడుతూ పంటలపై అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేప కషయాలు పిచికారి చేస్తే పురుగుల గుడ్లు నివారించవచ్చని తెలిపారు. రాత్రిపూట రసం పీల్చే పురుగుల నివారణకు సోలార్ ఫిరమోన్ ట్రాప్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్కిరాల పేట ఉప సర్పంచ్ వై.మధు బాబు, నరిశెట్టి వారి పాలెం గ్రామ సర్పంచ్ ముప్పాళ్ళ శ్రీనివాస రావు, రెండు గ్రామాల వ్యవసాయ సహాయకురాలు డి. రోషిణి, కె.చంద్రిక, రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)