జిల్లా పశు సంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ కే రమేష్

0

 జిల్లా పశు సంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ కే రమేష్

BSBNEWS - KANDUKUR 


స్థానిక డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు  కార్యాలయంలో డివిజన్ లోని ఏడి, పశు వైద్యుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఉపసంచాలకులు డాక్టర్ జి.శ్రీధర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా నెల్లూరు జిల్లా జెడి డాక్టర్ రమేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ అక్టోబర్ 25 నుంచి అఖిల భారత 21 వ పశుగణన పారదర్శకంగా చేయాలనీ తెలిపారు. డివిజన్ లో నియమించిన 69 ఎన్నుమారేటర్స్ లు, డివిజన్ లోని 1,10,204 గృహలలో పశు గణన చేయాలనీ చెప్పారు. ఈ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 28 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ నెల 31 వరకు అన్ని గొర్రెలకు, మేకలకు నట్టల నివారణకు మందు పంపిణీ చేయాలనీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సహాయ సంచాలకులు, డాక్టర్ పి. శ్రీనివాసులు, డాక్టర్లు యశోద, . మాదవి లత, డివిజన్ పశువైద్యులు, పారా సిబ్బంది, ఏ హెచ్ ఏ ఎస్ లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)